'సశేషం’ అంటూ ఓ ఆసక్తికర పోస్ట్ చేసిన చిరంజీవి!

06-04-2020 Mon 19:46
  • ఏప్రిల్ 8వ తేదీ..
  • ఈ తారీఖుతో నాకు చాలా అనుబంధం ఉందంటూ ట్వీట్
  • ఈ ట్వీట్ తో చిరంజీవి అభిమానుల్లో నెలకొన్న ఆసక్తి
Chiranjeevi posts an interesting tweet

టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏప్రిల్ 8వ తేదీ.. ఈ తారీఖుతో తనకు బోలెడంత అనుబంధం ఉందని గుర్తు చేసుకుంటూ ఈ పోస్ట్ లో ఆయన పేర్కొన్నారు. అయితే, ఇందుకు సంబంధించిన ఏ విషయాన్నీ తెలియజేయని చిరంజీవి, (సశేషం).. అంటూ తన పోస్ట్ లో తెలిపారు. కాగా, ఈ పోస్ట్ పై చిరంజీవి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆ తేదీతో చిరంజీవికి ఉన్న అనుబంధమేంటో తెలుసుకోవాలనే ఉత్సుకతో ఉన్నారు.