విజయ్ దేవరకొండను అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే టెన్షన్ గా వుంది :హీరోయిన్ అనన్య పాండే

06-04-2020 Mon 17:04
  • విజయ్ దేవరకొండ నాకు మంచి ఫ్రెండ్ 
  • సెట్లో చాలా సాదాసీదాగా ఉంటాడు 
  • అందుకోసమే వెయిట్ చేస్తున్నానన్న అనన్య పాండే 
puri Jagannadh Movie

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతున్నారు. అందం .. అభినయం .. దానికి తోడు అదృష్టం కలిసొచ్చినవాళ్లు కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు తెరకి బాలీవుడ్ నుంచి మరో భామ పరిచయమవుతోంది .. ఆ అమ్మాయి పేరే 'అనన్య పాండే'. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న తాజా చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే ముంబైలో ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా అనన్య పాండే మాట్లాడుతూ .. "విజయ్ దేవరకొండ తన స్టార్ డమ్ ను ఎంతమాత్రం చూపించడు. సెట్లో చాలా సాదాసీదాగా ఉంటాడు. తను నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఈ సినిమాతో నేను సౌత్ కి పరిచయమవుతున్నందుకు ఎంత ఆసక్తితో ఉన్నానో, విజయ్ దేవరకొండను బాలీవుడ్లో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే విషయంలోను అంతే ఆత్రుతతో వున్నాను. మా ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా మరింత హెల్ప్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.