Perni Nani: పక్క రాష్ట్రంలో కూర్చొని విమర్శలు చేస్తున్నారు: చంద్రబాబుపై పేర్ని నాని మండిపాటు

Perni Nani fires on Chandrababu
  • కరోనా ఎక్కడ ప్రబలిందో చంద్రబాబు చెప్పాలి
  • వైరస్ కట్టడికి ప్రభుత్వం చాలా చేస్తోంది
  • ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశాం
కరోనా వైరస్ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో కూర్చుని చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారని... రాష్ట్రంలో కరోనా ఎక్కడ ప్రబలిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడి కోసం తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోందని... లాక్ డౌన్, కర్ఫ్యూలాంటి చర్యలు చేపట్టామని తెలిపారు. ఒకవేళ రాష్ట్రంలో కరోనా ప్రబలినట్టైతే... ఆ మహమ్మారి టీడీపీ నేతలకు కూడా సోకాలి కదా? అని ఎద్దేవా చేశారు. కరోనా సోకిన వారికి ప్రభుత్వమే వైద్యం చేయిస్తోందని... ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు.
Perni Nani
YSRCP
Chandrababu
Telugudesam
Corona Virus

More Telugu News