పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.10 లక్షల విరాళం ప్రకటించిన కృష్ణంరాజు కుటుంబం

06-04-2020 Mon 16:54
  • రూ.4 లక్షలు అందించిన కృష్ణంరాజు అర్ధాంగి శ్యామలాదేవి
  • రూ.2 లక్షల చొప్పున విరాళం ఇచ్చిన ముగ్గురు కుమార్తెలు
  • గర్వంగా ఉందన్న కృష్ణంరాజు
Krishnam Raju and Family contributes to PM Cares relief fund

కరోనా వైరస్ భూతాన్ని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు భారీగానే అందుతున్నాయి. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు కుటుంబసభ్యులు పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.

కృష్ణంరాజు అర్ధాంగి శ్యామలాదేవి రూ.4 లక్షలు, పెద్దకుమార్తె సాయి ప్రసీద రూ.2 లక్షలు, రెండో కుమార్తె సాయి ప్రకీర్తి రూ.2 లక్షలు, మూడో అమ్మాయి సాయి ప్రదీప్తి రూ. 2 లక్షలు చొప్పున మొత్తం రూ.10 లక్షలు పీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. దీనిపై కృష్ణంరాజు స్పందిస్తూ, కరోనాపై పోరాటంలో తన కుటుంబం కూడా పాల్గొంటున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.