మార్కెట్లో కోడి గుడ్డు కొండెక్కినా, మాకు మాత్రం నష్టమే: బండ్ల గణేశ్

06-04-2020 Mon 11:09
  • ఒక్కో గుడ్డు ఉత్పత్తికి రూ. 4.20 ఖర్చు
  • వస్తున్నది మాత్రం మూడు రూపాయలు మించడం లేదు
  • దయచేసి ఆదుకోవాలని బండ్ల గణేశ్ విజ్ఞప్తి
Bandla Ganesh appeal for Egg Price

బహిరంగ మార్కెట్లో కోడి గుడ్డు ధర కొండెక్కి కూర్చునా, పౌల్ట్రీ రైతుకు మాత్రం నష్టమే వస్తోందని నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టిన ఆయన, కొండెక్కిన కోడిగుడ్డు ధర అని ఈరోజు ప్రముఖ దిన పత్రికలో చదివానని తెలిపారు. 

"కోళ్ల పరిశ్రమ అంటే చికెన్ కి సంబంధించిన కోడి కాదు. కోడి రైతు అంటే కోడిగుడ్లు అమ్ముకునే వాడని అంటారు. ఈ రోజు మా ఉత్పత్తి ధర నాలుగు రూపాయల 20 పైసలు అవుతుంది" అని చెప్పుకొచ్చిన ఆయన, "మాకు మాత్రం రెండు రూపాయల ఎనభై పైసల నుంచి మూడు రూపాయలు మాత్రమే వస్తుంది. మా నష్టాన్ని దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని కాపాడటానికి ప్రయత్నించండి" అని అభ్యర్థించారు.