అత్తగారితో కలిసి దీపాలు వెలిగించిన నాగార్జున

05-04-2020 Sun 21:35
  • కరోనాపై పోరాట స్ఫూర్తిని దీపాల సాయంతో ప్రకటించాలన్న మోదీ
  • తన కుటుంబ సభ్యులతో కలిసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించిన నాగ్
  • కరోనాను తరిమేద్దాం అంటూ ట్వీట్
Akkineni Nagarjuna lit the candles in his home

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున తన కుటుంబసభ్యులతో కలిసి రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పేసి, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సమయంలో నాగ్ అత్తగారు కూడా అక్కడే ఉండడంతో ఆమె చేతికీ ఓ కొవ్వొత్తి అందించారు. నాగ్, అమల, అఖిల్ ఈ సందర్భంగా మోదీ పిలుపుకు అనుగుణంగా వ్యవహరించి దేశ ఐక్యతను చాటారు. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఫొటోను ట్వీట్ చేసిన నాగ్... ఈ వెలుగులతో కరోనా చీకట్లను తరిమేద్దాం అంటూ వ్యాఖ్యానించారు.