ప్రగతి భవన్ వద్ద కొవ్వొత్తి చేతబట్టి స్ఫూర్తిని చాటిన సీఎం కేసీఆర్... వీడియో ఇదిగో!

05-04-2020 Sun 21:19
  • ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పేయాలన్న మోదీ
  • ప్రధాని పిలుపును ఆచరించిన సీఎం కేసీఆర్
  • గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధాని పిలుపుకు విశేష స్పందన
CM KCR appears with a candle at Pragathi Bhavan

కరోనా చీకట్లను తరిమికొట్టాలన్న ప్రగాఢ సంకల్పంతో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేరకు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో లైట్లు ఆర్పివేసి కొవ్వొత్తి వెలిగించారు. సరిగ్గా 9 గంటలకు ఆయన కొవ్వొత్తి వెలిగించి ఆ వెలుగులతో చీకట్లను పారదోలే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, నగరాలు, పట్టణాలే కాకుండా గ్రామాల్లో సైతం మోదీ పిలుపుకు విశేష స్పందన వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు తమ నివాసాల్లో లైట్లు ఆర్పి దీపాలు, కొవ్వొత్తులతో కరోనా మహమ్మారిపై పోరాట స్ఫూర్తిని చాటారు.
.