గల్లా జయదేవ్ తనయుడు అశోక్ ఫస్ట్ లుక్ ఇదిగో!

05-04-2020 Sun 21:05
  • వెండితెరకు పరిచయం అవుతున్న మహేశ్ బాబు మేనల్లుడు
  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా అశోక్ హీరోగా చిత్రం
  • హీరోయిన్ గా నిధి అగర్వాల్
Galla Ashok first look revealed

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ టాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా అశోక్ ఓ యూత్ ఫుల్ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. ఇక, ఆదివారం అశోక్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టేబుల్ ల్యాంప్ వెలుతురులో పుస్తకం చదువుకుంటున్న అశోక్ ను ఈ ఫస్ట్ లుక్ లో చూడొచ్చు.

ఈ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేశారు. ఇందులో జగపతిబాటు, నరేశ్ తదితరులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.