New Delhi: ‘షబ్ఎ బరాత్ జాగ్నేకీ రాత్’ సందర్భంగా ఢిల్లీలో ముస్లింలు ఎవరూ బయటకు రావద్దని పోలీస్ హెచ్చరిక

  • ఈ నెలలో ముస్లింల పండగ షబ్ ఎ బరాత్ జాగ్నేకీ రాత్ 
  • 8,9 తేదీల్లో ప్రజలు ఎవరూ బయటకు రావొద్దు
  • లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

లాక్ డౌన్ నేపథ్యంలో ముస్లింలు ప్రతి ఏటా నిర్వహించే పండగ షబ్ ఎ బరాత్ జాగ్నేకీ రాత్ కి బ్రేక్ పడింది. ఏప్రిల్ 8,9 తేదీల్లో ఎ బరాత్ జాగ్నేకీ రాత్  సందర్భంగా ఢిల్లీ ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, ఇళ్లల్లోనే ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల నిమిత్తం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా బయటకు వస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలంటూ పోస్టర్ల ద్వారా ఢిల్లీ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. లాక్ డౌన్ కు ముస్లిం మత పెద్దలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సహకరించాలని కోరారు. కాగా, ‘ఎ బరాత్ జాగ్నేకీ రాత్ ’ సందర్భంగా ముస్లిం యువకులు బైక్ లపై వీధుల్లో తిరుగుతారు.

More Telugu News