Punjab: కరోనా బాధిత బాలుడికి ఆసుపత్రిలోనే పుట్టిన రోజు వేడుకలు

  • రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి 
  • తల్లితోపాటు బిడ్డకు కూడా సోకిన వైరస్ 
  • మానవతా దృక్పథంతో వ్యవహరించిన వైద్యసిబ్బంది
birthday in hospital for corona sufferar

రోగం వెంటాడుతున్నప్పుడు మానసిక ఆనందం రోగిని వేగంగా కోలుకునేలా చేస్తుందన్న వైద్య పరిభాషను అక్షరాలా అమలు చేస్తూ రెండేళ్ల కరోనా బాధిత బాలుడికి ఆసుపత్రిలోనే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి ఆసుపత్రి సిబ్బంది మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే...పంజాబ్ రాష్ట్రం నవషార్ ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఇటీవల కరోనా వైరస్ సోకడంతో మృతి చెందాడు. అతని కుటుంబంలోని 14 మందికి వైరస్ సోకింది. వీరిలో ఈ తల్లిబిడ్డ కూడా ఉన్నారు. వీరిని నవషార్ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. నిన్న ఆ బాలుడి రెండో పుట్టిన రోజు అని తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రిలోనే వేడుకలు నిర్వహించారు. 

బాలుడికి కొత్త దుస్తులు, చాక్లెట్లు బహుమతులుగా ఇచ్చారు. 'సిబ్బంది బర్త్ డే కేక్ కోసం కూడా ప్రయత్నించారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఎక్కడా లభించలేదు' అని ఆసుపత్రి సీనియర్ వైద్యాధికారి హర్విందర్ సింగ్ తెలిపారు.

More Telugu News