Virat Kohli: ఈ రోజు రాత్రి 9 గంటలకు భారతీయ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెబుదాం: విరాట్‌ కోహ్లీ

Kohli invokes spirit of India
  • కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలన్న మోదీ
  • విరాట్ కోహ్లీ మద్దతు
  • అభిమానుల్లోని పవరే  స్టేడియంలోని పవర్‌
  • దేశ ప్రజల్లోని స్ఫూర్తే భారత స్ఫూర్తి 
ఈ రోజు రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు లైట్లు స్విచ్ఛాఫ్‌ చేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ స్ఫూర్తిని చాటాలని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు.

'అభిమానుల్లోని పవరే  స్టేడియంలోని పవర్‌. అలాగే, దేశ ప్రజల్లోని స్ఫూర్తే భారత స్ఫూర్తి. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని మన దేశ ప్రజలమంతా ఒకటిగా నిలబడతామని ప్రపంచానికి చాటుదాం. అలాగే, వైద్య సిబ్బందికి మద్దతుగా మనం ఉన్నామని చాటి చెబుదాం. టీమిండియా చైతన్యవంతమైంది' అని ఆయన ట్వీట్ చేశాడు. 
Virat Kohli
Team India
India
Cricket
Corona Virus

More Telugu News