ఈ వీడియో నా మనసును హత్తుకుంది: యువరాజ్ సింగ్

05-04-2020 Sun 07:16
  • విధి నిర్వహణలో నిద్రాహారాలు మానేసిన పోలీసులు, వైద్యులు
  • తమ ఆహారాన్ని యాచకునికి అందించిన పోలీసులు
  • సోషల్ మీడియాలో వీడియో పెట్టిన యూవీ
Cricketer Yuvaraj Posted a Video of Police

కరోనాపై భారతావని చేస్తున్న పోరాటంలో వైద్యులు, పోలీసుల పాత్ర మరవలేనిది. ప్రజలను రక్షించేందుకు వీరు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో వీరు నిద్రాహారాలు మరిచారు. ఇక పోలీసులైతే, రోడ్లపైనే అన్నం తింటూ, కాసేపు విశ్రమిస్తున్న వీడియోలు ఎన్నో వైరల్ అవుతున్నాయి.

లేటెస్ట్ గా భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, ఈ వీడియో తన మనసును హత్తుకుందని వ్యాఖ్యానిస్తూ, ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పోలీసులు, తాము తినడానికి తెచ్చుకున్న ఆహారాన్ని, రోడ్డుపక్కన అనాధలా పడివున్న యాచకుడికి అందించారు. కష్ట కాలంలో తమ ఆహారాన్ని త్యాగం చేయడం, వారిలోని దయకు నిదర్శనమని, ఈ వీడియో తరువాత, పోలీసులపై తనకు గౌరవం మరింతగా పెరిగిందని యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.