వారు నన్ను కరోనా వైరస్‌ను చూస్తున్నట్లు చూస్తున్నారు: ఫొటో పోస్ట్ చేసిన రామ్‌ గోపాల్‌ వర్మ

04-04-2020 Sat 20:09
  • టీవీలో రాముయిజం ఎపిసోడ్లు చూస్తోన్న కుటుంబం
  • ఫొటో పోస్ట్ చేస్తూ వర్మ చమక్కులు
  • త్వరలోనే ప్రారంభోత్సవమని వ్యాఖ్య
Though they are watching Ramuism episodes

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ని ఉద్దేశిస్తూ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్ చేశారు. ఓ కుటుంబంలోని వ్యక్తులు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. అందులో రామ్‌ గోపాల్ వర్మ మాట్లాడుతున్నారు. 'రాముయిజం' పేరిట ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు వారు చాలా ఆసక్తికరంగా చూస్తున్న ఫొటోను వర్మ పోస్ట్ చేశారు.

'వారు రాముయిజం ఎపిసోడ్లు చూస్తోన్న తీరుని చూడండి.. ఈ క్వారంటైన్‌ సమయంలో కరోనా వైరస్‌ను చూస్తున్నట్టు నన్ను తదేకంగా చూస్తున్నారు' అని ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. 'పునరుద్ధరణ పనుల కోసం ప్రపంచం మొత్తాన్ని మూసేశారు. త్వరలోనే గొప్ప ప్రారంభోత్సవం ఉంటుంది' అని వర్మ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.