ఎట్టకేలకు గాయని కనిక కపూర్ కు కరోనా నెగెటివ్

04-04-2020 Sat 19:48
  • ఐదో పరీక్షలో కనికకు కరోనా లేదని వెల్లడి
  • ఇటీవలే లండన్ నుంచి వచ్చిన కనిక
  • గత నాలుగు పర్యాయాలు కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళన
Finally singer Kanika Kapoor tested corona negative

బాలీవుడ్ గాయని కనిక కపూర్ గత కొన్నిరోజులుగా కరోనా వైరస్ తో బాధపడుతున్నారు. ఇప్పటికే ఆమెకు నాలుగు పర్యాయాలు కరోనా టెస్టులు నిర్వహించగా, అన్నింటా పాజిటివ్ ఫలితం వచ్చింది. అయితే ఇవాళ నిర్వహించిన కరోనా పరీక్షలో కనికకు నెగెటివ్ వచ్చింది. అయితే ఆసుపత్రి వర్గాలు కనిక మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని పేర్కొన్నాయి. కనిక కపూర్ కొన్నివారాల కిందట లండన్ నుంచి ముంబయి వచ్చింది. ఆపై తన స్వస్థలం లక్నో వెళ్లింది. అక్కడ అనేక పార్టీల్లో పాల్గొంది. కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.  

ఆమెకు గత నాలుగు పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో, ఆమె ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.  చివరికి ఐదో పర్యాయం ఆమెకు కరోనా నెగెటివ్ అని రావడంతో కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, కనిక తన ప్రవర్తనతో ఆసుపత్రి వర్గాలను కూడా విసిగించింది. తనకు సౌకర్యాలు కల్పించడంలేదంటూ ఇంతెత్తున ఎగిరిపడింది. దాంతో ఆసుపత్రి వర్గాలు ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి.