కరోనాను జయించి హీరోలా వెళ్లాడు.. చప్పట్లతో అభినందనలు.. వీడియో ఇదిగో

04-04-2020 Sat 18:55
  • కేరళలో ఘటన
  • కాసర్‌గోడ్‌ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ వ్యక్తి డిశ్చార్జ్‌
  • వైద్య సిబ్బంది, ఇతర రోగుల అభినందనలు
 Medical staff patients clap as the Kasargods first COVID19 patient leaves

కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ అని తేలిన మొట్టమొదటి వ్యక్తి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. అతడికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పూర్తి ఆరోగ్య వంతుడిగా అతడిని ఇంటికి పంపారు. అతడు ఇంటికి వెళ్తోన్న సమయంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది, అందులో చికిత్స తీసుకుంటోన్న ఇతర రోగులు అతడికి టాటా చెప్పారు. అతడు ఉత్సాహంగా ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా ఇరు వైపులా నిలబడిన వైద్య సిబ్బంది, ఇతర రోగులు చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు లభ్యమైంది.