సుకుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్

04-04-2020 Sat 16:38
  • గతంలో వచ్చిన 'జగడం'
  • మళ్లీ సెట్ అవుతున్న కాంబినేషన్ 
  • వచ్చే ఏడాదిలోనే సెట్స్ పైకి  
Sukumar Movie

ప్రస్తుతం సుకుమార్ .. బన్నీ కథానాయకుడిగా ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన పనులతోనే ఆయన బిజీగా వున్నాడు. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ ప్రాజెక్టు తరువాత సుకుమార్ ఏ హీరోతో సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలోనే రామ్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవలే రామ్ కి సుకుమార్ ఒక కథ వినిపించడం, కథ చాలా కొత్తగా ఉందంటూ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. 2007లో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'జగడం' సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆడలేదుగానీ, రామ్ కి యూత్ లో మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ అవుతోంది. బన్నీ సినిమాను పూర్తిచేసిన తరువాతనే రామ్ సినిమాపై సుకుమార్ శ్రద్ధ పెట్టనున్నట్టు తెలుస్తోంది.