'బుట్టబొమ్మా' సాంగుకి 10 కోట్ల వ్యూస్!

04-04-2020 Sat 11:47
  • బన్నీ క్రేజ్ ను పెంచిన 'అల వైకుంఠపురములో'
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తమన్ పాటలు 
  • విశేషంగా 1 మిలియన్ లైక్స్  
Ala vaikunthapuramulo Movie

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన 'అల వైకుంఠపురములో' సంచలన విజయాన్ని నమోదు చేసింది. అల్లు అర్జున్ కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ సినిమా విజయంలో తమన్ సంగీతం ప్రధానమైన పాత్రను పోషించింది. ఆయన స్వరపరిచిన ప్రతి పాట యూత్ ను ఒక ఊపు ఊపేసింది.

ఇక ఈ సినిమాలోని 'బుట్టబొమ్మా' అనే ఫుల్ వీడియో సాంగ్ ను ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేశారు. యూ ట్యూబ్ లో ఈ పాట ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ సాంగ్, అరుదైన ఘనతను సాధించింది. అంటే 10 కోట్ల మంది ఈ పాటను వీక్షించారన్న మాట. ఈ పాటకి 1 మిలియన్ లైక్స్ లభించడం మరో విశేషం. స్వరకల్పన .. సాహిత్యం .. కొరియోగ్రఫీ .. ఆలాపన .. చిత్రీకరణ .. ఇలా అన్నీ కుదిరిన కారణంగానే ఈ సాంగ్ ఈ రేంజ్ లో ఆకట్టుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.