Corona Virus: ఏపీలో మరిన్ని పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు.. నెల్లూరులో అత్యధికంగా 32 కేసులు

coronavirus cases in ap

  • 11.30 గంటల్లో కొత్తగా 16 కేసులు
  • 180కి చేరిన పాజిటివ్‌ కేసులు
  • కృష్ణా జిల్లాలో 27 కేసులు 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు మరిన్ని పెరిగిపోయాయి. నిన్న రాత్రి 10.30 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల మధ్య కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరిందని ఏపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. నెల్లూరులో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో అత్యధికంగా 27, గుంటూరు, కడప జిల్లాల్లో 23 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఏపీలో అత్యధిక బాధితులు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే ఉన్నారు.
           

  • Loading...

More Telugu News