Singareni: సింగరేణి ఉద్యోగుల జీతంలో యాభై శాతం కోత... ఇచ్చేది తర్వాతే!

half salary payment for singareni empolyees
  • లాక్‌డౌన్‌ కారణంగా నిర్ణయం
  • కనీసం రూ.15 వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయం
  • దీంతో తక్కువ వేతనం వచ్చే వారికి కోత ఉండకపోవచ్చు
లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరిస్తూ సింగరేణి యాజమాన్యం తమ ఉద్యోగుల విషయంలో ఇదే నిర్ణయం అమలు చేయాలని భావిస్తోంది. మార్చినెల వేతనంలో సగం మాత్రమే చెల్లించాలని, మిగిలింది తర్వాత చెల్లించాలని నిర్ణయించింది.

అయితే ఈ నెలలో పదవీ విరమణ చేసిన కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించింది. కనీసం రూ.15 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇవ్వాని నిర్ణయించింది. ఇప్పటికే పండగ అడ్వాన్స్‌, సహకార సొసైటీ లోన్‌ రికవరీ, క్లబ్బు రికవరీలను వాయిదా వేశారు. సింగరేణిలో NCWA ఉద్యోగులు మొత్తం సుమారు 43 వేల మంది ఉండగా వీరిలో 27 వేల మందికి మార్చి నెలలో సగం జీతం అందుకున్నా సరే 15 వేల రూపాయలకు పైగానే వస్తుంది. కానీ, మిగిలిన సుమారు 13,600 మందిలో 15 వేల కన్నా తక్కువ జీతం వచ్చే వాళ్ళు ఉన్నారు. వీరిని పరిగణనలోకి తీసుకున్న యాజమాన్యం కనీస వేతనం 15 వేలకు తగ్గకుండా చూడాలని నిర్ణయించింది.
Singareni
Employees
wages

More Telugu News