ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ నేత దారుణ హత్య.. పాతకక్షలే కారణం?

04-04-2020 Sat 09:08
  • ప్రాణాలు కోల్పోయిన మరో ఇద్దరు.. నలుగురికి గాయాలు
  • బాధితులకు సరైన చికిత్స అందించాలన్న సీఎం యోగి
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
SP Leader shot dead in Uttarpradesh

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత సహా ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు. గోండా జిల్లాకు చెందిన ఎస్పీ నేత లాతి సింగ్‌ను కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇక లాతిసింగ్ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు సహా మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధితులకు నాణ్యమైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు.