సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

04-04-2020 Sat 07:41
  • పవన్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ 
  • ఎన్టీఆర్ తో కొరటాల శివ ప్రాజక్ట్ 
  • యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'అల్లుడు అదుర్స్'  
Jaquellin Fernandej opposite Pawan Kalyan

 *  పవన్ కల్యాణ్ సరసన బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించనుంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా జాక్వెలిన్ ని తీసుకున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు.  
*  ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లోనూ 'జనతా గ్యారేజ్' హిట్ చిత్రం వచ్చిన సంగతి విదితమే.
*  'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'అల్లుడు అదుర్స్' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పూర్తి మేకోవర్ తో సరికొత్తగా కనిపిస్తాడట.