ఏపీలో 164కు పెరిగిన కరోనా కేసుల సంఖ్య.. తూర్పుగోదావరి, విశాఖలో కొత్త కేసులు
- తూర్పుగోదావరిలో రెండు, విశాఖలో ఓ కేసు నమోదు
- ఆసుపత్రి నుంచి మొత్తం నలుగురు డిశ్చార్జ్
- అందులో ఇద్దరు యూకే నుంచి వచ్చినవారే
అలాగే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడిని కూడా డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు. అతడు కూడా యూకే నుంచి వచ్చాడని, కోవిడ్ లక్షణాలతో గత నెల 20న కాకినాడ ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. అతడికి కూడా మూడుసార్లు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రిపోర్టులు రావడంతో నిన్న డిశ్చార్జ్ చేసినట్టు వివరించారు. వీరిద్దరితో కలిపి మొత్తం నలుగురు వ్యక్తులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు.