నెల రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

04-04-2020 Sat 07:11
  • ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయల కేటాయింపు
  • తన పిలుపు మేరకు బీజేపీ కార్యకర్తలు భారీ విరాళాలు అందించారని ప్రశంస
  • తన నియోజకవర్గానికి ఇప్పటికే రూ. 50 లక్షలు కేటాయించానన్న ఎంపీ
Karimnagar MP Bandi Sanjay gave one month salary to PM CARES

కోవిడ్‌పై పోరులో కరీంనగర్ ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేయి కలిపారు. తన నెల రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించడంతోపాటు ఎంపీలాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయించారు. కరోనా వైరస్ నివారణ చర్యల కోసం కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటికే రూ. 50 లక్షలు కేటాయించినట్టు చెప్పారు. తన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు పీఎం కేర్స్ ఫండ్‌కు భారీగా విరాళాలు అందించినట్టు సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా వారందరికీ ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.