Sri Lekha: బాలు గారితో పాడాలంటే భయమేసింది: శ్రీలేఖ

Ayanaki Iddaru Movie
  • పాటలంటే ప్రాణం 
  • బాలు అలా అన్నారు 
  • ఆయనే మెచ్చుకున్నారన్న శ్రీలేఖ 
సంగీత దర్శకురాలిగా .. గాయనిగా శ్రీలేఖ మంచి పేరు తెచ్చుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన తొలిపాట అనుభవాన్ని గురించి ప్రస్తావించింది. "చిన్నప్పటి నుంచి నాకు పాటలు వినడం అంటే ఇష్టం .. పాడటమంటే ఇష్టం. ఒకసారి బాలూగారి దగ్గర నేను సరదాగా పాడితే, 'అచ్చం కాకి పాడినట్టుగా వుంది' అంటూ నవ్వేశారు.

ఆ తరువాత కొంతకాలానికి ఆయనతోనే కలిసి 'ఆయనకి ఇద్దరు' సినిమా కోసం పాడే అవకాశం లభించింది. ఆ సినిమాకి 'కోటి' గారి సంగీత దర్శకత్వంలో బాలుగారితో కలిసి 'అందాలమ్మో అందాలు' అనే పాట పాడాను. నిజానికి ఆయనతో పాడటానికి చాలా భయపడ్డాను. కానీ ఆయన సలహాలు .. సూచనలు ఇస్తూ, నాలో భయాన్ని పోగొట్టారు. పాట రికార్డింగ్ పూర్తయిన తరువాత, 'కాకి .. కోకిల అయిందే' అన్నారు. అప్పుడు నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చింది.
Sri Lekha
Balu
Koti

More Telugu News