Siddipet District: సమష్టి కృషితోనే కరోనాను పారద్రోలగలం: మంత్రి హరీశ్ రావు

minister harishrao toured in gazwel city
  • గజ్వేల్‌లో పర్యటించిన మంత్రి 
  • ఇటీవల ఇక్కడ పాజిటివ్‌ కేసు నమోదు
  • ప్రజలకు అవగాహన కలిగించిన హరీశ్ రావు 
అవగాహన, సమష్టి కృషితోనే కరోనా మహమ్మారిని పారద్రోలగలమని, ఇందుకు ప్రజలంతా సహకరించాలని తెలంగాణ మంత్రి హరీశ్ ‌రావు కోరారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో ఇటీవల కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు మంత్రి గజ్వేల్‌ పట్టణంలో పర్యటించారు.

కరోనా సోకిన వ్యక్తి పరిసర ప్రాంత నివాసితులకు పలు అవగాహన అంశాలు వివరించారు. లాక్‌డౌన్‌ను పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. అత్యవసరమై బయటకు వెళ్లివచ్చినప్పుడు కాళ్లు, చేతులు కడుక్కోవాలని, శానిటైజర్లు వాడాలని అన్నారు. వేసుకున్న దుస్తులు కూడా వేడినీళ్లలో ముంచి ఆరబెట్టుకుంటే మంచిదని సూచించారు. మరో 15 రోజులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Siddipet District
gazwel
Harish Rao

More Telugu News