Telangana: తెలంగాణలో నిన్న ఒక్క రోజే ముగ్గురి మృతి.. 9కి చేరిన మరణాల సంఖ్య

3 dead in Telangana in one day death toll rises to 9
  • గాంధీ ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు మృతి
  •  మృతులు ముగ్గురూ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే
  • సోమవారం మరణించిన ఆరుగురిలో ఐదుగురు మర్కజ్ యాత్రకు వెళ్లొచ్చిన వారే
తెలంగాణలో నిన్న ఒక్కరోజే ముగ్గురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 9కి చేరుకుంది. మరోవైపు, రాష్ట్రంలో కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు మృతి చెందినట్టు నిన్న కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు తెలిపారు.  నిన్న వైరస్ సోకిన 30 మందితోపాటు మృతి చెందిన ముగ్గురు ఢిల్లీ వెళ్లి వచ్చినవారేనని పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నారని, అందరి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. కాగా, మర్కజ్ యాత్రకు వెళ్లి వచ్చిన వారిలో 300 మందికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వివరించారు.
Telangana
Corona Virus
Gandhi Hospital

More Telugu News