Corona Virus: ఏపీలో 111కు చేరిన ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య

Corona virus cases increases day by day in Andhrapradesh
  • ఏపీలో క్రమక్రమంగా పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య
  • హెల్త్ బులిటిన్ విడుదల చేసిన నోడల్ అధికారి
  • నిన్న సాయంత్రం 7 గంటల తర్వాత కొత్తగా 24 పాజిటివ్ కేసులు నమోదు
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.  పాజిటివ్ కేసుల సంఖ్య 111కు చేరింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఏపీ నోడల్ అధికారి హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. నిన్న సాయంత్రం 7 గంటల తర్వాత కొత్తగా 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, గుంటూరు జిల్లాలో 20, కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల్లో 15 చొప్పున, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 11, తూర్పు గోదావరి జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 6, నెల్లూరు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూలులో 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Corona Virus
positive cases
Andhra Pradesh
Health buletein

More Telugu News