Hong Kong: పెంపుడు పిల్లికి సోకిన కరోనా.. ప్రమాదమేమీ లేదంటోన్న వైద్యులు

Pet cat tests positive for coronavirus in Hong Kong
  • హాంకాంగ్‌లో ఘటన
  • ఇప్పటికే అక్కడ రెండు శునకాలకు కరోనా
  • జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకదంటోన్న వైద్యులు
హాంకాంగ్‌లో ఓ పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. యజమాని వల్లే పిల్లికి కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే హాంకాంగ్‌లో రెండు శునకాలకు కరోనా సోకింది. జంతువులకు కరోనా సోకడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదని వైద్యులు తెలిపారు. పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు కరోనా వైరస్‌ సోకుతుందనడానికి ఆధారాలు లేవన్నారు.

జంతువులను పెంచుకుంటున్న వారు ఆందోళన చెందవద్దని వైద్యులు చెప్పారు. పెంపుడు జంతువులకు వాటి యాజమాని లేక ఇతర మనుషుల ద్వారా వైరస్‌ సోకుతుందని తెలిపారు. ఈ జంతువులను 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచితే సరిపోతుందన్నారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా తెలిపింది.
Hong Kong
Corona Virus

More Telugu News