USA: అమెరికాలో 4.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి: ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్

America to loose 47M jobs due to corona says St Lewis Fed
  • అమెరికాపై కరోనా తీవ్ర ప్రభావం
  • 32.1 శాతానికి పెరగనున్న నిరుద్యోగం
  • ఇప్పటికే ఉద్యోగాలను కోల్పోయిన లక్షలాది మంది
కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రదేశం అమెరికా కుదేలవబోతోంది. దాదాపు అన్ని అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. తాజాగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ సెయింట్ లూయిస్ వెల్లడించిన అంచనాలు భయాందోళనలను కలిగించేలా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో రెండో త్రైమాసికంలో నిరుద్యోగం 32.1 శాతానికి పెరుగుతుందని తెలిపింది. మొత్తం 4.7 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పింది. 1948 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగ స్థాయి ఉండబోతుండటం ఇదే ప్రథమం కావడం గమనార్హం.

పలు రాష్ట్రాల్లో షట్ డౌన్ల కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. 33 లక్షల మంది ప్రజలు నిరుద్యోగ లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

తాజా అంచనాల ప్రకారం సేల్స్, ప్రొడక్షన్, ఆహార ఉత్పత్తులు, సేవల విభాగాలలో ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. క్షురకులు, రెస్టారెంట్ సర్వర్లు, ఫ్లైట్ అటెండెంట్లు కూడా భారీగా నిరుద్యోగులుగా మారనున్నారు.
USA
Unemployment
Corona Virus
Federal Reserve Bank of St Louis

More Telugu News