శ్రీరామనవమి వేడుకల గురించి ఏపీ మంత్రి వెల్లంపల్లి ప్రకటన!
- దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్
- పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లోకి భక్తులకు అనుమతి నిరాకరణ
- శ్రీరామ నవమిని ఇంట్లోనే జరుపుకోవాలన్న ఏపీ మంత్రి వెల్లంపల్లి
- వైష్ణవ ఆలయాల్లో అర్చకులు మాత్రమే పూజలు, వేడుకలు నిర్వహిస్తారని వెల్లడి
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో, ప్రజారోగ్యం మేరకు భక్తులు స్వచ్ఛందంగా దేవాలయ దర్శనాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పండుగ నాడు ఇంట్లోనే శ్రీరామనవమి పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ పర్యాయం నిరాడంబరంగా పండుగ జరుపుకుందామని, సామాజిక దూరం పాటిద్దామని మంత్రి పిలుపునిచ్చారు. అటు, ప్రధాన దేవాలయాల్లో స్వామివార్లకు, అమ్మవార్లకు నిత్యం జరిగే నివేదనలు, పూజలు యథావిధిగా జరుగుతున్నాయని వెల్లడించారు.