Koppula Eshwar: కేటీఆర్ విసిరిన ‘సేఫ్ హ్యాండ్స్’ ఛాలెంజ్ ను నెరవేర్చిన కొప్పుల ఈశ్వర్

Koppula Eeswar fulfills safe hands challenge of KTR
  • ‘కరోనా’పై ప్రజలను చైతన్య పరిచేందుకు ‘సేఫ్ హ్యాండ్స్’ ఛాలెంజ్
  • కరీంనగర్ లోని తన నివాసంలో ఛాలెంజ్ నెరవేర్చిన కొప్పుల
  • ఎంపీ వెంకటేశ్, ముగ్గురు ఎమ్మెల్యేలకు కొప్పుల ఛాలెంజ్ 
కరోనా వైరస్ వ్యాపించకుండా పాటించాల్సిన జాగ్రత్త చర్యల్లో భాగంగా  చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనిపై ప్రజలను చైతన్య పరుస్తున్న ‘సేఫ్ హ్యాండ్స్’ ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ తనకు విసిరిన ఈ ఛాలెంజ్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ నెరవేర్చారు.

కరీంనగర్ లోని తన నివాసంలో చేతులను శుభ్రం చేసుకున్న ఆయన, ప్రతి ఒక్కరూ  శుభ్రతను పాటించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనా వైరస్ దరిచేరదని అన్నారు. అనంతరం, ఎంపీ వెంటేశ్ నేత, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, బాల్క సుమన్, జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతలకు సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ విసిరారు.


Koppula Eshwar
TRS
Safe Hands Challenge
KTR

More Telugu News