Honda City: హోండా సిటీ న్యూ మోడల్ కారుకు క్రాష్ టెస్ట్... రక్షణ పరంగా 5 స్టార్ రేటింగ్!

  • అతి త్వరలో విడుదల కానున్న నూతన మోడల్
  • అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో 44.83 పాయింట్లు
  • వెల్లడించిన ఏసియన్ ఎన్ కాప్ చైర్ పర్సన్ జహారహ్ ఇషాక్
5 Star Rating for Honda City Car in Crash Test

హోండా సిటీ 2020 మోడల్ కారు ప్రమాదాలు జరిగినప్పుడు, లోపల ఉన్న వారి ప్రాణాలను కాపాడటంలో ఆసియన్ ఎన్ కాప్ సేఫ్టీ రేటింగ్ లో 5 స్టార్ రేటింగ్ ను సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో 44.83 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలో 22.82 పాయింట్లు, సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీస్ విభాగంలో 18.89 పాయింట్లను కారు సాధించిందని ఎన్ కాప్ (న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్) ఫల్ సౌదీస్ట్ ఏసియన్ కంట్రీస్ వెల్లడించింది.

సుమారు 8 సంవత్సరాల క్రితం ఈ కారు తొలి వర్షన్ ఆవిష్కృతం కాగా, 2012లో తొలిసారి, ఆపై 2014లో మరోసారి క్రాష్ టెస్ట్ లను నిర్వహించారు. ఈ సంవత్సరం విడుదల కానున్న న్యూ జనరేషన్ సెడాన్ వర్షన్ కు అత్యుత్తమ క్రాష్ రేటింగ్ లభించింది. ఇక ఈ కారులో నాలుగు ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్ వ్యవస్థలతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ టెక్నాలజీ తదితరాలున్నాయని ఏసియన్ ఎన్ కాప్ చైర్ పర్సన్ డాక్టర్ సీతీ జహారహ్ ఇషాక్ వెల్లడించారు. ఈ కారులో ఉన్న సేఫ్టీ టెక్నాలజీస్ తనకెంతో నచ్చాయని ఆయన తెలిపారు. కాగా, ఈ కారు అతి త్వరలో భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

More Telugu News