Markaz: ఢిల్లీ, నిజాముద్దీన్ లోని 'మర్కజ్' ఇన్చార్జిపై ఎఫ్ఐఆర్ నమోదు

  • కొన్నిరోజుల కిందట నిజాముద్దీన్ ప్రాంతంలో మతపరమైన సమావేశం
  • విదేశాల నుంచే కాకుండా దేశీయంగానూ పెద్ద సంఖ్యలో హాజరు
  • హాజరైన వారిలో కొందరికి కరోనా పాజిటివ్
FIR filed on Markaz incharge in Nizamuddin

ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని 'ఆలమీ మర్కజ్' అనే మసీదు  పేరు కరోనా నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల ఇక్కడ జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి ఇండోనేషియా, మలేసియా, కిర్గిజ్ స్థాన్ వంటి దేశాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో కొందరు కరోనా బారినపడడం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో మర్కజ్ ఇన్చార్జిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ మతపరమైన సమావేశానికి హాజరైన 163 మంది నిజాముద్దీన్ వాసులను ఆసుపత్రికి తరలించారు. ఈ సమావేశానికి 300 నుంచి 400 మంది హాజరై ఉంటారని భావిస్తున్నారు.

More Telugu News