Nara Rohit: ‘కరోనా’పై పోరాటానికి సినీ హీరో నారా రోహిత్ రూ.30 లక్షల విరాళం

Cine Hero Nara Rohit announces 30 lakh rupees donation
  • ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు
  • ఏపీ, తెలంగాణలకు పది లక్షల చొప్పున విరాళం
  • తగు జాగ్రత్తలతో ‘కరోనా’ను అరికట్టవచ్చు
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై జరుపుతున్న పోరాటానికి సినీ నటుడు నారా రోహిత్ మద్దతు ప్రకటించాడు. తన వంతుగా భారీ విరాళం ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి,  రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.30 లక్షలు విరాళంగా ఇస్తానని తెలిపాడు. ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పది లక్షల రూపాయల చొప్పున ప్రకటించాడు. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా ‘కరోనా’ ను అరికట్టవచ్చని ప్రజలకు పిలుపు నిచ్చాడు.

 సినీ హీరో సందీప్ కిషన్ రూ.3 లక్షల విరాళం

టాలీవుడ్ కి చెందిన మరో నటుడు సందీప్ కిషన్ కూడా రూ. 3 లక్షలు విరాళంగా ప్రకటించాడు. సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) కి ఈ విరాళం ఇచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో తన సొంత రెస్టారెంట్ 'వివాహ భోజనంబు'లో పని చేస్తున్న 500 మందికి పైగా ఉద్యోగుల బాధ్యతలను తాను చూసుకుంటానని చెప్పాడు.
Nara Rohit
Tollywood
Corona Virus
30 lakhs donation
pm relief fund
Andhra Pradesh
Telangana

More Telugu News