Allu Arjun: టాలీవుడ్ సినీ కార్మికుల కోసం రూ.20 లక్షల విరాళం ప్రకటించిన అల్లు అర్జున్

Allu Arjun donates twenty lakhs for Tollywood cine workers
  • దేశవ్యాప్తంగా లాక్ డౌన్
  • నిలిచిపోయిన సినీ షూటింగులు
  • ఉపాధి లేక అలమటిస్తున్న సినీ కార్మికులు
  • సానుభూతి వ్యక్తం చేసిన బన్నీ
టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ సినీ కార్మికుల కోసం విరాళం ప్రకటించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగులు, చిత్ర ప్రదర్శనలు నిలిచిపోయిన నేపథ్యంలో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండడం పట్ల అల్లు అర్జున్ స్పందించారు. తనవంతుగా కార్మికుల కోసం రూ.20 లక్షలు అందించాలని నిర్ణయించారు. ఈ విరాళాన్ని బన్నీ కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి అందించనున్నారు. ఈ విరాళంతో కలిపి బన్నీ కరోనా సహాయకచర్యల కోసం మొత్తం రూ.1.45 కోట్లు ఇచ్చినట్టయింది. ఆయన ఇంతకుముందు, ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు రూ.1.25 కోట్ల విరాళం ప్రకటించారు. అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలోనూ విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.
Allu Arjun
Bunny
Donation
Tollywood
Workers
CCC
Corona Virus
COVID-19

More Telugu News