Biswabhusan Harichandan: ‘పీఎం కేర్స్’, సీఎం రిలీఫ్ ఫండ్స్ కు ఏపీ గవర్నర్ హరిచందన్ విరాళాలు

AP Governor Harichandan announces his donations to PM CARES and CM RELIEF Funds
  • పీఎం కేర్స్ ఫండ్ కు ఒక నెల వేతనం విరాళం 
  • సీఎం రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయలు 
  • ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ విరాళాలు ప్రకటించారు. పీఎం కేర్స్ ఫండ్ కు ఒక నెల వేతనాన్ని, సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక లక్ష రూపాయలను ఆయన ఇవ్వనున్నట్టు గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించాలంటే ఇళ్ల నుంచి బయటకు రాకుండా సురక్షితంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ సూచించారు.
Biswabhusan Harichandan
Governor
Andhra Pradesh
Corona
Donations

More Telugu News