Donald Trump: ప్రిన్స్ హ్యారీపై నాకు చాలా గౌరవం ఉంది.. అయితే, వారి భద్రత ఖర్చులను వారే భరించాలి: ట్రంప్

Prince Harry and Meghan has to bear security expenditure on their own says  Donald Trump
  • హ్యారీ దంపతులు కెనడాలో ఉంటారని తొలుత విన్నాం
  • ఇప్పుడు అమెరికాకు వచ్చారు
  • వారు ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు
బ్రిటీష్ రాజవంశ వారసులు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు రాజసౌధాన్ని విడిచివెళ్లిన సంగతి తెలిసిందే. వారు అమెరికాలో సాధారణ జీవితాన్ని గడపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, బ్రిటన్ అన్నా, బ్రిటీష్ రాణి అన్నా తనకు చాలా గౌరవమని చెప్పారు. వారితో తనకు మంచి స్నేహం ఉందని అన్నారు.

రాచకుటుంబాన్ని వీడిన హ్యారీ, మేఘన్ దంపతులు కెనడాలో నివసిస్తారని తొలుత విన్నామని... ఇప్పుడు వారు కెనడాను వీడి అమెరికాకు వచ్చారని తెలిపారు. అమెరికాలో వారు సంతోషంగా ఉండొచ్చని, అయితే వారి భద్రత ఖర్చులను అమెరికా భరించదని, ఆ ఖర్చులను వారే చెల్లించాలని స్ఫష్టం చేశారు.
Donald Trump
Prince Harry
Meghan
USA
British

More Telugu News