మా పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి: వాపోయిన బండ్ల గణేశ్
- కోట్లు ఖర్చు చేసి పౌల్ట్రీ వ్యాపారం
- కరోనా భయంతో మందకొడి వ్యాపారం
- ట్విట్టర్ లో వ్యాఖ్యానించిన బండ్ల గణేశ్
"మా పరిస్థితి ముందుకెళితే గొయ్యి వెనుకకి వెళ్తే నుయ్యి లా ఉంది, కోట్లు పెట్టుబడి పెట్టాము. భయంగా వుంది. దీయబ్బ కరోనా" అని ఆయన ట్వీట్ చేశాడు. కాగా, కరోనా భయంతో చికెన్ అమ్మకాలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. చికెన్ తింటే కరోనా సోకదని నిపుణులు సూచిస్తున్నా, ప్రజలు మాత్రం చికెన్ వైపు చూడని పరిస్థితి నెలకొని వుండటంతో పౌల్ట్రీ రంగం కుదేలైంది.