Kanika Kapoor: ఇంటికి వెళ్లాలనుంది: సింగర్ కనిక కపూర్ భావోద్వేగం

Kanika Kapoor response after testing positive for fourth time
  • నేను ఐసీయూలో లేను
  • పిల్లలను, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వేచి చూస్తున్నాను
  • వారిని ఎంతో మిస్ అవుతున్నాను
కరోనా వైరస్ బారిన పడిన గాయని కనిక కపూర్ కు నాలుగో సారి నిర్వహించిన పరీక్షల్లో కూడా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. తాను ఐసీయూలో లేనని... తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపింది. తదుపరి పరీక్షలో తనకు నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నానని చెప్పింది. తన పిల్లలు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వేచి చూస్తున్నానని తెలిపింది. వారిని ఎంతగానో మిస్ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

"కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని జీవితం నేర్పుతుంది. కానీ అదే కాలం, జీవితం యొక్క విలువను తెలియచేస్తుంది" అంటూ ఒక కొటేషన్ పోస్ట్ చేసింది

కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నెల 20న కనికాను ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. మార్చి 23, 27 తేదీల్లో నిర్వహించిన టెస్టుల్లో కూడా పాజిటివ్ అని తేలింది. ఆమెపై పోలీసు కేసు కూడా నమోదైంది.
 
Kanika Kapoor
Singer
Bollywood

More Telugu News