Garibh Kalyani: వైద్యులతోపాటు సిబ్బంది అందరికీ రూ.50 లక్షల బీమా: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి

  • కేంద్రం ప్రకటించిన 'గరీబ్ కళ్యాణ్' అందరికీ వర్తింపు 
  • ప్రైవేటు ఆసుపత్రులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 
  • జాతీయ విపత్తు నివారణ నిధి నుంచి ప్రీమియం చెల్లింపు
garibh kalyani bhima for all medical staff says javaharreddy

కరోనా విపత్తు నేపథ్యంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ రూ.50 లక్షల బీమా వర్తింపజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వైద్యులు మొదలుకొని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఎయిమ్స్, సీజీ హెచ్ఎస్ ల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా కేంద్రం ప్రకటించిన 'గరీబ్ కళ్యాణ్' బీమా పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే వేర్వేరు రకాల బీమా ప్రయోజనాలు పొందుతున్న వారికి కూడా ఈ బీమా సదుపాయం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని జాతీయ విపత్తు నివారణ నిధి (ఎన్టీఆర్ఎఫ్) నుంచి చెల్లించనున్నట్లు తెలిపారు.

More Telugu News