Visakhapatnam District: మద్యం మత్తులో పెద్ద భార్యపై కత్తితో దాడి చేసిన భర్త!

man injured wife with knife
  • మొదటి భార్యకు తీవ్రగాయాలు 
  • మద్యం మత్తులో వీరంగం 
  • విశాఖ జిల్లా గూడెంకాలనీ గ్రామంలో ఘటన

తాగివచ్చావెందుకని ప్రశ్నించారన్న కోపంతో ఓ వ్యక్తి భార్య పై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. విశాఖ జిల్లా గూడెంకొత్త వీధి మండలం గూడెంకాలనీ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.

గ్రామానికి చెందిన వంతల నాగరాజుకు లక్ష్మి, సుశీల ఇద్దరు భార్యలు. వీరు ఒకే గ్రామంలో వేర్వేరు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అందరం కలిసి ఒకేచోట ఉందామని నాగరాజు భార్యలతో అన్నాడు. దీనికి ఇద్దరు భార్యలు అంగీకరించడంతో ఒక ఇంటికి చేరుకున్నారు.

ఆదివారం కావడంతో నాటుకోడి కూరవండి భార్యలు సిద్ధం చేశారు. ఈలోగా బయటకు వెళ్లి వచ్చిన నాగరాజు పూటుగా మద్యం తాగాడు. తాగి ఇంటికి వచ్చిన భర్తను లక్ష్మి, సుశీల ఇద్దరూ నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజు కోడిని కోసే కత్తిని పెద్దభార్య లక్ష్మి పైకి విసరడంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Visakhapatnam District
gudemkothaveedhi
Crime News
wife injured

More Telugu News