Nithin: జూన్ లో నితిన్ 'రంగ్ దే'!

  • నితిన్ హీరోగా 'రంగ్ దే'
  • నిర్మాతగా నాగవంశీ 
  •  జూన్ లో ప్రేక్షకుల ముందుకు
Rang De Movie in June

ఇటీవల వచ్చిన 'భీష్మ' సినిమాతో నితిన్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నితిన్ కి ఈ సినిమా ఊరటనిచ్చింది. ఆయన తదుపరి సినిమాగా 'రంగ్ దే' నిర్మితమవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నితిన్ నుంచి రానున్న మరో ప్రేమకథా చిత్రం ఇది.

నితిన్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేశ్ అలరించనుంది. జూన్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే తేదీని ప్రకటించనున్నారు. నితిన్ - కీర్తి సురేశ్ జోడీని తెరపై చూడటానికి అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు. వెంకీ అట్లూరి ఈ జంటకు హిట్ ఇస్తాడేమో చూడాలి.

More Telugu News