Mopidevi Venkataramana: గుంటూరు జిల్లాలో 44 అనుమానిత కేసులున్నాయి: మోపిదేవి

  • నలుగురికి నెగెటివ్ వచ్చిందన్న మోపిదేవి
  • 88 ఆసుపత్రులు సిద్ధం చేశామని వెల్లడి
  • 15 రోజుల పాటు రేషన్ సరఫరా చేస్తామని హామీ
AP Minister Mopidevi Venkataramana says four negative cases in Guntur district

రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏపీ మంత్రులు తరచుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో 44 అనుమానిత కేసులు ఉన్నాయని వెల్లడించారు. నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా బాధితుల కోసం 88 ఆసుపత్రులు సిద్ధం చేశామని, 9,352 బెడ్లు అందబాటులో ఉంచామని వివరించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు దృష్ట్యా 15 రోజుల పాటు రేషన్ సరఫరా చేస్తామని చెప్పారు. దుకాణాల్లో నిత్యావసరాల ధరలు పెంచితే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

More Telugu News