Pedda Jiyyangar: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపం కొండెక్కిందన్నది దుష్ప్రచారమే: పెద్ద జియ్యంగారు

Pedda Jiyyangar responds on fake news in social media
  • సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ అసంతృప్తి
  • అన్నిసేవలు ఆగమశాస్త్ర ప్రకారమే జరుగుతున్నాయని వెల్లడి
  • సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి
తిరుమల శ్రీవారి ఆలయంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆలయ పెద్ద జియ్యంగారు స్పందించారు. ఆలయంలో దీపం కొండెక్కిందని అసత్య ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. స్వామివారికి అన్ని సేవలు ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని, స్వామివారికి శాస్త్రోక్తంగా నైవేద్యం సమర్పణ జరుగుతోందని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
Pedda Jiyyangar
Tirumala
TTD
Andhra Pradesh

More Telugu News