Nithin: కరోనా ఎఫెక్ట్: పెళ్లి వాయిదా వేసుకున్న హీరో నితిన్

Hero Nithin wedding postponed due to corona outbreak
  • ఇటీవలే షాలినితో నితిన్ నిశ్చితార్థం
  • ఏప్రిల్ 16న దుబాయ్ లో జరగాల్సిన పెళ్లి
  • కరోనా విజృంభణతో మనసు మార్చుకున్న నితిన్
టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి ప్రభావంతో వాయిదా పడింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తెలియజేశారు. ఇటీవలే నితిన్ నిశ్చితార్థం షాలిని అనే అమ్మాయితో జరిగింది. నితిన్, షాలిని కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. దుబాయ్ లో ఘనంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే కరోనా ఉద్ధృతం కావడంతో సామాజిక బాధ్యత దృష్ట్యా పెళ్లి వాయిదా వేసుకోవడమే మేలని నితిన్ భావించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. మార్చి 30న తన పుట్టినరోజు వేడుకలను కూడా వాయిదా వేసుకుంటున్నట్టు తెలిపారు. అభిమానులు కూడా తన జన్మదిన వేడుకలు జరపవద్దని, లాక్ డౌన్ స్ఫూర్తిని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో ఉండడమే దేశానికి సేవ చేసినంత అని నితిన్ అభిప్రాయపడ్డారు.
Nithin
Wedding
Postpone
Corona Virus
Shalini
Tollywood

More Telugu News