RGV: ఈ ఖాళీ సమయంలో చంద్రబాబు, లోకేశ్ ఆ సినిమా చూడాలని కోరుతున్నాను: వర్మ

RGV wants Chandrababu and Lokesh to watch Amma Rajyamlo Kadapa Biddalu movie
  • 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను చూడాలని కోరిన వర్మ
  • ఆ సినిమాపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని విజ్ఞప్తి
  • అమెజాన్ ప్రైమ్ లింకును కూడా ట్వీట్ చేసిన వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో అందరిలాగే చంద్రబాబు, లోకేశ్ కూడా ఇంటికే పరిమితమయ్యారని, ఇప్పుడు వాళ్లిద్దరూ అమెజాన్ ప్రైమ్ లో 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా చూడాలని కోరుతున్నానని ట్వీట్ చేశారు. ఆ సినిమా చూసి వారిద్దరి విలువైన అభిప్రాయాలను ఫీడ్ బ్యాక్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ లో 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్రం లింకును కూడా ట్విట్టర్ లో పంచుకున్నారు.
RGV
Chandrababu
Nara Lokesh
Amma Rajyamlo Kadapa Biddalu
Amazon Prime

More Telugu News