Nellore: నెల్లూరు పోలీసుల మధ్య 'లాక్ డౌన్ వార్'... నా కొడుకునే కొడతావా అంటూ యుద్ధం... వీడియో ఇదిగో!

  • రోడ్లపైకి వచ్చే యువతను కంట్రోల్ చేస్తున్న పోలీసులు
  • పెట్రోల్ కోసం వెళితే కొట్టారని కానిస్టేబుల్ ఫిర్యాదు
  • వైరల్ అవుతున్న వీడియో
Nellore Police Brawl

లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలన్న ఉద్దేశంతో, రోడ్లపైకి వస్తున్న యువతపై కొందరు పోలీసులు లాఠీలను ఝళిపిస్తున్న వేళ, నెల్లూరులో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఓ యువకుడు టూ వీలర్ పై వస్తుండగా, అతన్ని లాఠీతో కొట్టిన ఓ కానిస్టేబుల్, బండి తాళాలు లాక్కున్నాడు. సదరు యువకుడు తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పగా, హుటాహుటిన ఆయన వచ్చి, కానిస్టేబుల్ తో గొడవకు దిగాడు.

తన కుమారుడినే కొడతారా? అంటూ దుర్భాషలాడాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. సదరు యువకుడి తండ్రి కూడా పోలీసు విభాగంలోనే పని చేస్తుండటం గమనార్హం. వారిద్దరూ కలబడుతుండగా, చూసిన స్థానికులు, వారిని విడదీశారు. ఆపై తన బిడ్డకు ఆపరేషన్ జరిగిందని, కాళ్లలో రాడ్ వేశారని, పెట్రోల్ కోసం వస్తే కొట్టారని ఆరోపిస్తూ, ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు తన కుమారుడిని తీసుకెళ్లాడు. ఈ తతంగం మొత్తాన్నీ కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.

More Telugu News