Roja: స్వయంగా రోడ్లపైకి వచ్చి నిత్యావసరాలు ఇచ్చి రోజా సేవలు.. మీరు చాలా గ్రేట్ మేడం అంటోన్న నెటిజన్లు

roja on corona
  • ఏపీలో నిత్యావసరాలు పంపిణీ
  • లైనులో రావాలని చెప్పిన ఎమ్మెల్యే
  • కూరగాయలు తూకం వేసి ఇచ్చిన రోజా
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ప్రభుత్వం ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేస్తోంది. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి నిత్యావసరాలు అందించాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.              
ఈ నేపథ్యంలో నగరిలో ఎమ్మెల్యే రోజా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ప్రారంభించారు. రోడ్లపైకి వచ్చి పేదలకు  అవగాహన కల్పిస్తూ మరీ ఆమె సేవలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆమె తన ఫేస్‌బుక్  ఖాతాలో పోస్ట్ చేశారు.                           
నిత్యావసరాల కోసం సామాజిక దూరం పాటించకుండా రోడ్లపై వస్తోన్న వారికి ఆమె పలు సూచనలు చేశారు. క్యూలో నిలబడాలని దూరంగా ఉండాలని చెప్పారు. పోలీసులతో కలిసి అవగాహన కల్పించారు. అనంతరం స్వయంగా కూరగాయలు తూకం వేసి కొందరికి అందించారు. తెల్ల రేషన్‌ కార్డుదారులకు రూ.1000 చొప్పున కూడా ఇస్తామని జగన్‌ ఇప్పటికే పెద్ద మనసుతో ప్రకటించారని ఆమె చెప్పారు. ఆమె చేసిన పోస్టులు చూస్తోన్న నెటిజన్లు చాలా చక్కగా అవగాహన కల్పిస్తూ సేవలు చేస్తున్నారని, మేరు చాలా గ్రేట్‌ మేడం అని కామెంట్లు చేస్తున్నారు.
Roja
Corona Virus
YSRCP

More Telugu News