spain: కరోనాతో ప్రాణాలు కోల్పోయిన స్పెయిన్‌ యువరాణి

  • మారియా థెరీసా ((86) మృతి
  • స్పెయిన్‌లో ఇప్పటివరకు 73 వేల కరోనా కేసులు 
  • 5,982 మంది మృతి  
spain princes dies

కరోనాతో బాధపడుతూ స్పెయిన్‌ యువరాణి మారియా థెరీసా ((86) ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో కరోనా కేసులు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. చివరకు ఆ మహమ్మారి మారియాను కూడా బలితీసుకుంది. స్పెయిన్‌లో ఇప్పటివరకు 73 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 5,982 మంది మృతి చెందారు. 

వచ్చే శుక్రవారం మాడ్రిడ్‌లో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. జులై 28, 1933లో ఆమె జన్మించారు. ప్రాన్స్‌లో ఆమె విద్యాభ్యాసం చేశారు.

ఇటలీ తర్వాత అత్యధిక కరోనా మరణాలు స్పెయిన్‌లోనే సంభవించాయి. ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో పరిస్థితులు చేజారి పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వేల్స్ యువరాజు చార్లెస్‌కు కరోనావైరస్ సోకినట్లు క్లారెన్స్ హౌస్ ధ్రువీకరించిన విషయం తెలిసిందే.

మరోవైపు బ్రిటన్‌ ప్రధానికి కూడా కరోనా సోకింది. సామాన్య ప్రజలే కాకుండా దేశాన్ని ఏలాల్సిన వారికి కూడా కరోనా సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది.

More Telugu News