Chandrababu: హైదరాబాద్‌లో కుమారుడు, మనవడితో చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. వీడియో ఇదిగో

chandrababu participates tdp foundation day

  • తమ నివాసం వద్దే వేడుక
  • కరోనా నేపథ్యంలో సింపుల్‌గా నిర్వహణ
  • నేతలు ఇళ్లపైనే పార్టీ జెండాలు ఎగురవేయాలని పిలుపు

తన కుమారుడు లోకేశ్, మనవడు దేవాన్ష్‌తో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని తమ నివాసంలో టీడీపీ జెండా ఎగురవేసి, ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ముగ్గురూ నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోను లోకేశ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

'పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా నివాసంలో పార్టీ జెండా ఎగురవేసి, స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారికి నివాళులు అర్పించాము' అని లోకేశ్ చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించట్లేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇళ్లపైనే పార్టీ జెండాలు ఎగురవేయాలని చంద్రబాబు చెప్పారు. అలాగే, కరోనా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News